మరోసారి మాయ చేసిన ఎస్పీబీ

సినిమా ఇండస్ట్రీకి ఎంత మంది సింగర్స్ వచ్చిన ఎస్పీబీ బాలు స్వరానికి మాత్రం ఎవరు చేరుకోవడం లేదు. అయన పాడుతుంటే మనసుకు

Update: 2019-12-09 14:46 GMT
sp balasubrahmanyam

సినిమా ఇండస్ట్రీకి ఎంత మంది సింగర్స్ వచ్చిన ఎస్పీబీ బాలు స్వరానికి మాత్రం ఎవరు చేరుకోవడం లేదు. అయన పాడుతుంటే మనసుకు హాయిగా ఉంటుంది. ఇక అందులో మెలోడియస్ సాంగ్స్ కి అయితే ఎంత చెప్పిన తక్కువే.. ఇప్పుడున్న గాయకులూ బాగానే పాడుతున్నప్పటికీ అయన మార్క్ ని మాత్రం ఎవరు అందుకోలేకపోతున్నారు. ఇప్పటికి కూడా మెలోడియస్ అంటే సంగీత దర్శకులకి కూడా బాలు మాత్రమే గుర్తుకువస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఎస్పీబీ నుంచి శతమానం భవతి, డిస్కోరాజా, పలాస ఇలా పలు సినిమాల్లో నుంచి అయన స్వరం నుంచి మంచి మెలోడీలు వచ్చాయి. తాజాగా ఈ లిస్టు లోకి మరో పాట కూడా చేరిపోయింది. సతీష్ వేగ్నిశ దర్శకత్వంలో తెరకెక్కిన శతమానం భవతి సినిమాలో నిలవదే మది నిలవదే అంటూ పీరియాడిక్ మెలోడీ పాడిన ఎస్పీబీ ఇప్పుడు అయన దర్శకత్వంలోనే వస్తున్న 'ఎంత మంచివాడవురా' సినిమాలో కూడా ఓ మెలోడి సాంగ్ ని పాడారు.

'ఏమో..ఏమో..ఏ గుండెల్లో ఏ బాధ వుందో, ఓ కొంచెం పాలు పంచుకుందాం..ఏమో..ఏమో..ఏ దారుల్లో ఏ బంధముందో.. బంధువుల సంఖ్య పెంచుకుందాం.. అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ని బాలు అద్భుతంగా పాడారు. ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాయగా, గోపీసందర్ సంగీతం అందించారు.

కళ్యాణ్ రామ్ హీరోగా మేహరీన్ కథానాయకగా నటిస్తున్న ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. పక్కా ఫ్యామిలీ సబ్జెక్టు తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో తనికెళ్ల, నరేష్,శరత్ బాబు, సుహాసిని ఇంకా అనేక మంది సీనియర్ ఆర్టిస్ట్ లు నటించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 15న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి జాతీయ అవార్డు దక్కించుకున్న దర్శకుడు సతీష్ వేగ్నిశ నుంచి సినిమా వస్తుండడంతో ఫ్యామిలీ ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. 

Full View

Tags:    

Similar News