సో ప్రౌడ్ ఆఫ్ యూ బావ: ద్రోణవల్లి హారిక
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం 'వెంకీమామ'.
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం 'వెంకీమామ'.. బాబీ దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మించాయి.. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. తమన్ సంగీతం అందించాడు. మంచి కామెడీ, ఎమోషన్ వాల్యూస్ పక్కా ఉండడం, వెంకటేష్, నాగ చైతన్య కలిసి అద్బుతంగా నటించడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 2019 డిసెంబర్ 13 న విడుదలైన తెలుగు సినిమాలన్నింటిల్లో కెల్లా అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది.
అయితే దీనిపైన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక స్పందిస్తూ... " సో ప్రౌడ్ ఆఫ్ యూ బావ" అని బాబీకి ట్వీట్ చేశారు. దీనికి గాను హారిక బాబీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, హారిక సోదరిని బాబీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి ఓ పాప కూడా ఉంది.
వెంకీమామ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాబీకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఇందులో అల్లు అర్జున్ తో ఓ సినిమా ఫిక్స్ అయినట్టు సమాచారం.. ఇప్పటికే కథ చర్చలు కూడా అయిపోయాయని అల్లు అర్జున్ తదుపరి చిత్రం బాబీతో ఉంటుందని తెలుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
Thank you @HarikaDronavali 😊 https://t.co/WWycESE1S0
— Bobby (@dirbobby) January 3, 2020