కరోనా నియంత్రణకి దర్శకుడు త్రివిక్రమ్ 20 లక్షల రూపాయల విరాళం

కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు.

Update: 2020-03-26 06:02 GMT
Trivikram Srinivas (File Photo)

కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు. ఇక ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ రూ. 2 కోట్లు, టాలీవుడ్ హీరో నితిన్ ఏపీ, తెలంగాణకు రూ.10 లక్షల రూపాలయ చొప్పున విరాళాలును అందజేశారు. తాజాగా హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి 50 లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయలను, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. కోటి రూపాయలను అందజేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులకు కొరోనా విపత్తు నిధికి చెరొక పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.. త్వరలోనే చెక్కును అందచేస్తానని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత నాగదేవర సూర్యవంశీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. ప్రపంచంలో ఇప్పటికే 20 వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక భారత్లో 630 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..

Tags:    

Similar News