మేం మగాళ్ళం కాదు మృగాళ్ళం.. మమ్మల్ని నమ్మొద్దు : సుకుమార్

అందరూ ఆ అమ్మాయి 100కి కాల్ చేసి చేసుండొచ్చు కదా అంటున్నారు. 100 కి ఎందుకు కాల్ చేసి ఉండకపోవచ్చు అంటే ఇద్దరు అబ్బాయిలు

Update: 2019-12-01 12:48 GMT
sukumar

ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న మాట షాద్‌నగర్ ప్రియాంకా రెడ్డి హత్య కేసు గురించే... మద్యం మత్తులో నలుగురు యువకులు ప్రియాంకా రెడ్డిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై దేశం మొత్తం స్పందిస్తుంది. వారిని ఉరి తీయాలన్న వాదనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఘటనపై దర్శకుడు సుకుమార్ స్పందించారు. " ఈ సంఘటనలు మన సొసైటీల జరుగుతుండడం చాలా చాలా బాధకరం... ఎందుకంటే విషయం తెలియగానే ముందు ఎవరికీ కనీళ్ళు ఆగవు.. దీనివల్ల రేపు పిల్లల్ని ఎలా పెంచాలి అన్నది ఓ ప్రశ్న లాగా మారిపోయింది. బతకడం కూడా భయంగా మారిపోయింది. క్రిమినల్స్ కూడా మనలో కూడా భాగమే.. మన దగ్గరి నుండి వచ్చినవాళ్ళే.. దీనికి మనం కూడా భాద్యులమే.. ప్రియాంక ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను..

అందరూ ఆ అమ్మాయి 100కి కాల్ చేసి చేసుండొచ్చు కదా అంటున్నారు. 100 కి ఎందుకు కాల్ చేసి ఉండకపోవచ్చు అంటే ఇద్దరు అబ్బాయిలు బైక్ కి పంక్షర్ అయిందని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ 100 కి ఫోన్ చేసి ఉంటే పోలీసులు వచ్చి ఉంటే.. నీకు హెల్ప్ చేద్దామని వస్తే మా మీదా అనుమాన పడతావా...? అని అనుకుంటారని చేసి ఉండకపోవచ్చు ఆ అమ్మాయి.. అంటే అమ్మాయిలు అబ్బాయిలని అంత నమ్ముతారు.. కానీ ప్లీజ్ మేం మగాళ్ళం కాదు మృగాళ్ళం.. మమ్మల్ని నమ్మొద్దు ప్రపంచం అలా ఉంది" అంటూ వాఖ్యానించారు సుకుమార్..  

Full View

Tags:    

Similar News