కేసీఆర్ కి ధన్యవాదాలు .. దర్శకుడు శంకర్ ..

Update: 2019-06-20 02:50 GMT

సినీ దర్శకుడు మరియు నిర్మాత శంకర్ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు .. తెలంగాణాలో స్టూడియో నిర్మాణం కోసం కేసీఆర్ 5 ఎక‌రాల స్థలం ఇచ్చారు . తెలంగాణ సినిమాను అభివృద్ధి చేసే నిమిత్తం 5 ఎక‌రాల స్థలాన్ని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. జీవో ప్రకారం శంక‌ర‌ప‌ల్లిలోని మోకిల్లలో స్టూడియో నిర్మాణం కోసం 5 ఎక‌రాల భూమిని కేటాయించారు. తెలంగాణ సినిమా ఉన్నతి కోసం ముఖ్యమంత్రి చేసిన స‌హ‌కారానికి ద‌ర్శకుడు ఎన్‌.శంక‌ర్ జూన్ 19న స్వయంగా ముఖ్యమంత్రిని క‌లిసి.. ఆయ‌న‌కు ప్రత్యేకంగా ధ‌న్యవాదాలు తెలిపారు. తెలంగాణా ఉద్యమ సమయంలో శంకర్ జై బోలో తెలంగాణా సినిమాని తీసారు .. ఈ సినిమాలో కేసీఆర్ కూడా ఓ పాట రాసారు .. అప్పటినుండి దర్శకుడు శంకర్ కి మరియు కేసీఆర్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. అదే టైంలో కూడా సినిమా ఇండ‌స్ట్రీ త‌ర‌ఫు నుంచి కృషి చేయాలనీ శంకర్ కేసీఆర్ ని కోరారు ..  

Full View

Tags:    

Similar News