రాజమౌళికి నచ్చని ఆస్కార్ విన్నింగ్ మూవీ!
లాక్ డౌన్ సమయం కావడంతో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అయ్యారు. అలాగే సెలబ్రిటీలు కూడా ఇంట్లోనే ఉంటూ కరోనాపై అవగాహన కల్పిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
లాక్ డౌన్ సమయం కావడంతో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అయ్యారు. అలాగే సెలబ్రిటీలు కూడా ఇంట్లోనే ఉంటూ కరోనాపై అవగాహన కల్పిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.ఇక టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇంట్లోనే ఉంటూ పుస్తకాలను చదువుతూ, సినిమాలు చూస్తూ గడిపేస్తున్నారు. అందులో భాగంగా ఆస్కార్ అవార్డ్ పొందిన పారాసైట్ చిత్రంపై ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.
ఆ సినిమా చూస్తున్నంత సేపు బోరింగ్ ఫీలింగ్ కలిగిందని, చూస్తూ అలానే పడుకుండిపోయానని చెప్పుకొచ్చారు. నాకు స్లోగా ఉండే సినిమాలు నచ్చవని కామెంట్స్ చేశారు. ఆస్కార్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్రంగా , ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాలలో పలు అవార్డులు దక్కాయి. అయితే ఇలాంటి సినిమాపై రాజమౌళి నెగిటివ్ గా కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆసక్తికరమైన వాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్(రౌద్రం రణం రుధిరం).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది.