'డబల్ ఇస్మార్ట్' తో త్వరలోనే కలుద్దాం .. పూరి

Update: 2019-07-28 06:57 GMT

పూరి కింద పడడం కామనే కానీ ఎంత తొందరగ కింద పడతాడో అంతే తొందరగా లేస్తాడు ..తాజాగా హీరో రామ్ తో కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతుంది . ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొత్తం 63 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినిమా నిర్మాత ఛార్మి చెప్పుకొచ్చారు . సినిమా యూనిట్ కూడా ఈ మధ్యనే సక్సెస్ మీట్ ని అరేంజ్ చేసింది . ఇప్పటికే ఏపీ లోని పలు ప్రాంతాల్లో సినిమా యూనిట్ విజయోత్సవ వేడుకలకు హాజరవుతూ సినిమా సక్సెస్ ని ఫాన్స్ తో కలిపి ఎంజాయ్ చేస్తున్నారు .

త్వరలో తెలంగాణాలో కూడా పర్యటించనున్నారు . అయితే దీనిపైన దర్శకుడు పూరి స్పందిస్తూ సినిమా సక్సెస్ కావాలని ఫస్ట్ టైం కోరుకున్నానని ఎక్కడికి వెళ్ళినా సినిమా హిట్టు హిట్టు అంటుంటే చాలా ఆనందంగా ఉందని , ఈ సినిమాకి సీక్వెల్ కావాలని ఫాన్స్ అడుగుతున్నారని , ఇప్పటికే ఈ టైటిల్ ని ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేసానని పూరి చెప్పుకొచ్చాడు . దానికి సంబంధించిన కథ కూడా రెడీ గా ఉందని , త్వరలోనే డబల్ ఇస్మార్ట్ తో కలుద్దామని పూరి చెప్పుకొచ్చాడు .  

Tags:    

Similar News