దర్శకుడు రాజ్‌కుమార్‌కు పూరి జగన్నాధ్ సహాయం..

ఈ విషయం తెలిసి ఇప్పటికే కొంతమంది సినిమా పరిశ్రమ నుండి అయనకి ఆర్ధిక సహాయం చేశారు. ఇక బుధవారం

Update: 2019-11-21 09:23 GMT
puri jagannath

మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా పునాదిరాళ్ళు.. ఈ సినిమాకి రాజ్ కుమార్ దర్శకుడు.. ప్రస్తుతం అయన ఆర్ధిక ఇబ్బందులతో అనారోగ్యంతో భాదపడుతూ, సహాయం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి ఇప్పటికే కొంతమంది సినిమా పరిశ్రమ నుండి అయనకి ఆర్ధిక సహాయం చేశారు. ఇక బుధవారం ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ రూ.50 వేల రూపాయలను అందజేశారు.
 

పూరితో పాటు మెహర్‌ రమేష్‌ రూ.10 వేలు, కాశీవిశ్వనాథ్‌ రూ.5 వేల రూపాయలను అందజేశారు. తనకి సహాయ పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రాజ్ కుమార్...

రాజ్ కుమార్ చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి గుర్తింపు పొందిన సినిమాలే చేశారు. అయన చేసిన పునాదిరాళ్ళు సినిమాకి గాను అయిదు నంది అవార్డులు రావడం విశేషం..

ఇక పూరి జగన్నాధ్ విషయానికి వస్తే ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్టు కొట్టాడు పూరి.. అ తరవాత విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని సమ్మర్ లో విడుదల చేయన్నున్నారు. 

Tags:    

Similar News