హరీష్ సూపర్బ్ : అనాధపిల్లలకి రెండు నెలలు సరిపడే సరుకులు
దర్శకుడు హరీష్ శంకర్.. చేసినవి కొన్ని సినిమాలు అయినప్పటికీ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
దర్శకుడు హరీష్ శంకర్.. చేసినవి కొన్ని సినిమాలు అయినప్పటికీ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హరీష్ ఈ రోజు తన 42 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సినీ తారాలు కూడా ఆయనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తన పుట్టిన రోజు సందర్భంగా అయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా తన పుట్టినరోజును 'హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమానిటీ' అనే అనాథాశ్రమంలోని 45 మంది అనాథ పిల్లలు మధ్య జరుపుకుంటున్నాడు.
ఇక తాజాగా కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో అనాధ అనాథాశ్రమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపధ్యంలో 'హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమానిటీ' అనే అనాథాశ్రమంకు రెండు నెలల పాటు నిత్యవసర వస్తువులు, బిస్కెట్స్, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, కేక్స్ వంటివి సమకూర్చాలని దర్శకుడు హరీష్ శంకర్ నిర్ణయం తీసుకున్నారు. హరీష్ శంకర్ సాయానికి ఆశ్రమంలోని అనాథ పిల్లలందరూ క్లాప్స్‌తో ధన్యవాదాలు తెలిపారు.
Shri. @harish2you ,a good hearted person and Director has been celebrating his birthday with our extended family since two years. He has been sponsoring Food to 2 d children.Dis year on his bday he has contributed groceries for 2mnths,sweets,snacks ,dry fruits,cakes,to our Home pic.twitter.com/g3DXweedgs
— HelpingHandsHumanity (@HHHjoinurhands) March 31, 2020
ఇక గత ఏడాది వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ సినిమాని చేసి మంచి హిట్ కొట్టిన హరీష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమాని చేసేందుకు సిద్దం అయ్యారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గతంలో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే..మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శృతిహసన్ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో సినిమా పట్టాలేక్కనుంది.