విజయ్ దేవరకొండ కొత్త అవతారం ఎత్తాడు. 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో నిర్మాతగా మారిన అతడు కౌంటర్లో కూర్చొని సినిమా టికెట్లు అమ్మాడు. తన సొంత నిర్మాణంలో తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కించిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కోసం తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. శుక్రవారం సినిమా విడుదల నేపథ్యంలో ఐమ్యాక్స్ థియేటర్లో విజయ్ సందడి చేశాడు. టికెట్ కౌంటర్లో కూర్చుని సినిమా టికెట్లు విక్రయించాడు. సినిమా చూద్దామని వచ్చిన ప్రేక్షకులు.. టికెట్ కౌంటర్లో విజయ్‌ని చూసి థ్రిల్ అయ్యారు. విజయ్ చేతుల మీదుగా టికెట్ తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. మీకు మాత్రమే చెప్తా చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించింది. ఈ నేపథ్యంలో విజయ్‌కి నిర్మాతగా తొలి విజయం దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Producer @TheDeverakonda Promotes #Meekumatramecheptha in his style. Went to @PrasadsMultiplx and gave tickets to audience And gifted cinemagoers free popcorn and drink coupons- as it's his first Production and he wants them to enjoy fully.#MMCFunRideFrmToday pic.twitter.com/O5HPS4aiWq
— BARaju (@baraju_SuperHit) November 1, 2019