Coronavirus: తెలుగు చిత్ర పరిశ్రమలోని నటుడికి కరోనా పాజిటివ్..

రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తుంది. చైనాలో మొదలైన ఈ వైరస్ మెల్లిమెల్లిగా ఇతర దేశాలు కూడా వ్యాపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది.

Update: 2020-03-23 06:37 GMT
Coronavirus positive

రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తుంది. చైనాలో మొదలైన ఈ వైరస్ మెల్లిమెల్లిగా ఇతర దేశాలు కూడా వ్యాపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పటికే ప్రపంచంలో 13 వేల మందికి పైగా మరణించారు. ఇక భారత్లో కూడా ఇప్పటికే నాలుగు వందల కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. ఇక తెలంగాణలో 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో ఆరు కేసులు నమోదయ్యాయి. దీనిపైన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో వైరస్ ప్రభావితమైన 75 జిల్లాలను లాక్ డౌన్ చేయాలని కేంద్రం ప్రకటించింది.

ఇక ఇదిలా ఉంటే... తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న ఒకతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది.. 10 రోజుల క్రితం బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్ అని టెస్టుల్లో తేలినట్లు సమాచారం.. అతడు స్వగ్రామం అయిన గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు శనివారం రాత్రి పల్నాడు రైల్లో చేరుకున్నాడు.గత వారం రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు బాధిత యువకుడి తల్లితో చెప్పగా దీంతో అతనికి వైద్య చికిత్స అందిస్తున్నారు.

అయితే ముందుగా అతనికి వైద్య సేవలు చేయించుకునేందు నిరాకరించారని, దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడికి వైద్యం అందించాలని, యువకుడికి అవగాహన కూడా కల్పించాలని కోరారు.. ప్రస్తుతం అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దీనితో గుంటూరులో కరోనా అనుమానిత కేసు నమోదైనట్లు అయింది. ప్రస్తుతం అతని కుటుంబసభ్యులకు కూడా వైద్య అధికారులు క్వారంటైన్ చేస్తున్నారు.

ఇక ఏపీలో మార్చి 31వ తేదీ వరకూ లాక్ డౌన్ ప్రకటించారు సీఎం జగన్. ఎమర్జెన్సీ మినహా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. 10వ తరగతి పరీక్షలు యదాతథంగా జరుగుతాయనీ, సమస్యలు ఉన్న సరే విద్యార్థలకు ప్రత్యేక రూమ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక మార్చి 29 వ తేది నాటికి పూర్తిగా రేషన్‌ అందుబాటులోకి ఉంటుందని, రేషన్‌ ఫ్రీగా ఇవ్వడమేక కాకుండా కేజీ పప్పును ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఏప్రిల్‌ 4న రూ.1000 అందిస్తామని జగన్ వెల్లడించారు. 

Tags:    

Similar News