'అల వైకుంఠపురములో' ఎన్టీఆర్ సినిమానా ?

మాటల మాంత్రికుడిగా తెలుగు చిత్రపరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మంచి పేరుంది. అక్షరాలను తూటాలుగా పేలుస్తాడు.

Update: 2019-12-01 09:56 GMT
Allu Arjun

మాటల మాంత్రికుడిగా తెలుగు చిత్రపరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మంచి పేరుంది. అక్షరాలను తూటాలుగా పేలుస్తాడు. అయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయిన చేయాలనీ అనుకోని హీరో బహుశా ఉండరేమో.. ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ కథానాయకుడుగా అల వైకుంఠపురములో అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో టబు తెలుగు ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అయితే ఈ సినిమా కథ సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఇంటిగుట్టు ఆధారంగా తెరకేక్కబోతుందని తెలుస్తుంది . ఆ కథను నేటితరానికి మార్పులు చేసి త్రివిక్రమ్ తెరకేక్కిస్తున్నాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇవి నిజమా కదా తెలియాలి అంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే..

ఇటివల దర్శకుడు త్రివిక్రమ్ పైన చాలా విమర్శలు వస్తున్నాయి. అయన చేసిన సినిమా కథలను ఎక్కడి నుండో కాపీ కొట్టి క్రెడిట్ ఇవ్వడం లేదు అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వాదన అ..ఆ,అజ్ఞాతవాసి, అరవింద సమేత సినిమాలకి గాను బలంగా వినిపించాయి. ఇందులో ఆ ఆ సినిమాపై స్పందించిన త్రివిక్రమ్ అ..ఆ యుద్ధనపూడి నవల ఆధారంగానే తెరకెక్కించానని అంగీకరించాడు...

ఇక అల వైకుంఠపురములో సినిమా విషయానికి వస్తే ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు బాగా హిట్టయ్యాయి. త్వరలో టిజర్ ని కూడా బయటకు వదలనున్నారు. భారీ అంచనాల నడుమ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Tags:    

Similar News