మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్ పై వివాదం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్ పై వివాదం చెలరేగింది. అబ్దుల్ కలాం బయోపిక్ హక్కులు తమ దగ్గర ఉన్నాయని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ముందుకు వచ్చింది.

Update: 2020-02-10 11:57 GMT
అబ్దుల్ కలాం బయోపిక్ పై వివాదం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్ విడుదలకు ముందే వివాదం మొదలయ్యింది. పింక్ జగ్వార్స్ నిర్మాణంలో కలాం బయోపిక్ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. తెలుగు హస్యనటుడు అలీ కలాం పాత్రదారిగా నటించబోతున్నారు.

అయితే కలాం బయోపిక్ తీసే హక్కు తమకు మాత్రమే ఉందన్నారు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్. కలాం బయోపిక్ రైట్స్ తమ దగ్గర మాత్రమే ఉన్నాయని చెప్పారు. కాలం జీవితంపై ఏ భాషలోనైనా సినిమా లేదా డాక్యుమెంటరీని నిర్మించే, పోస్టర్లను రిలీజ్ చేసే అధికారిక హక్కులను తాము కలిగి ఉన్నామని స్పష్టం చేశారు. త్వరలనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.  

Tags:    

Similar News