కరోనాకి మరో కమెడియన్ బలి

సామాన్యుల నుంచి సెలబ్రేటిల వరకు ఎందరో కరోనా వైరస్ తో పోరాడుతూ మృతి చెందుతున్నారు.

Update: 2020-04-03 08:13 GMT
Comedian Eddie Large

సామాన్యుల నుంచి సెలబ్రేటిల వరకు ఎందరో కరోనా వైరస్ తో పోరాడుతూ మృతి చెందుతున్నారు. తాజాగా జ‌ప‌నీస్ క‌మెడీయ‌న్ కెన్‌ షిమురా కరోనా బారిన ప‌డి చనిపోయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు అంగ్ల హాస్యనటుడు మృతి చెందాడు. 1970 మరియు 80లలో టీవీలో బాగా ప్రసిద్ది చెందిన ఈ కమెడియన్ ఎడ్డీ లార్జ్ గత కొద్దిరోజులుగా అనారోగ్య స‌మ‌స్యల‌తో బాధపడుతున్నాడు.

గుండె వైఫల్యంతో బాధపడుతున్న అయన తాజాగా ఆసుపత్రిలో చేరగా అతనికి కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో కరోనాతో పోరాడుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని అయన పెద్ద కుమారుడు ర్యాన్ మెక్‌గిన్నిస్ త‌న ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. అయన మరణం పట్ల అక్కడి చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది. బతికున్నంత కాలం ప్రేక్షకులను నవ్వించడాన్నే ఇష్టపడ్డాడని అభిప్రాయపడుతున్నారు. 




Tags:    

Similar News