నిర్మాణ రంగంలోకి అలీ
బాల నటుడుగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు అలీ.. ఆ తర్వాత కమెడియన్ గా మారి
బాల నటుడుగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు అలీ.. ఆ తర్వాత కమెడియన్ గా మారి స్టార్ హీరోలతో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత కమెడియన్ నుంచి హీరోగా మారి 50 సినిమాల్లో నటించాడు అలీ. ప్రస్తుతం అలీ కి సినిమా అవకాశాలు తగ్గాయని చెప్పాలి. కొత్త జనరేషన్ కమెడియన్స్ రావడం.. కొత్త హీరోల పక్కన అలీ అంతగా సూట్ అవ్వకపోవడంతో అవకశాలు తగ్గాయి. కానీ టెలివిజన్ రంగంలో అలీ దూసుకుపోతున్నాడు.
పలు కార్యక్రమాలకి హోస్ట్ గా వ్యవహరిస్తూ తనదైన ముద్రని వేసుకుంటున్నాడు అలీ.. అంతేకాకుండా రాజకీయల్లోకి కొనసాగుతున్నాడు. గత సంవత్సరం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ పార్టీలో చేరాడు.
అయితే ఇప్పుడు నిర్మాణ రంగంవైపు కూడా అలీ అడుగులు వేశాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వెబ్ సిరీస్లు, టీవీ షోలు, సీరియల్స్ నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. దీనికి సంబంధించిన లోగోను ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి కలిసి అవష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం ఎం శ్రీలేఖ, నటుడు రవివర్మ హాజరయ్యారు. బాబా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీకి మనోజ్ హుస్సేన్ క్రియేట్ డైరెక్టర్గా వ్యవహరించనున్నాడని వెల్లడించారు.
బాలనటుడుగా, హాస్యనటుడుగా, హీరోగా, హోస్ట్ గా ఇప్పటివరకు సక్సెస్ లను అందుకున్న అలీ ఈ నిర్మాణ రంగంలో కూడా సక్సెస్ కావాలని వారు కోరుకున్నారు.