City Civil Court: యశోద సినిమా OTTలో విడుదలకు బ్రేక్...

Yashoda Movie: నటి సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద... ఈ మూవీ OTTలో రిలీజ్ చేసేందుకు వీల్లేదంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Update: 2022-11-23 14:25 GMT

City Civil Court: యశోద సినిమా OTTలో విడుదలకు బ్రేక్...

Yashoda Movie: నటి సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద... ఈ మూవీ OTTలో రిలీజ్ చేసేందుకు వీల్లేదంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సినిమా ప్రొడక్షన్‎ టీమ్‎కు నోటీసులు పంపింది. ఈ సినిమాలో ఆస్పత్రి పేరుతో సమంత చేసిన క్యారెక్టర్ వల్ల తమ ఆస్పత్రి ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని EVA IVF ఆస్పత్రి యాజమాన్యం సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఈ సినిమా OTTలో విడుదల చేయకుండా ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన కోర్టు యశోద సినిమాను OTTలో విడుదల చేయొద్దంటూ ఆదేశాలిచ్చింది. దీనిపై తదుపరి విచారణ డిసెంబర్ 19కి వాయిదా వేసింది.

Tags:    

Similar News