రియల్ లైఫ్ లో మామ అల్లుళ్ళు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్యలు కలిసి రీల్ లైఫ్ లో కూడా మామఅల్లుళ్ళు గానే నటించిన చిత్రం వెంకీ మామ. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో, మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాపైన కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ తారలు కూడా అభినందనలు తెలుపుతున్నారు.
అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి వెంకీమామ సినిమాపైన ప్రశంసలు కురిపించారు. తన ఫ్యామిలీతో కలిసి సినిమాని చూసారు చిరంజీవి.. అనంతరం సినిమా గురించి ఓ వీడియో రూపకంగా చెప్పారు చిరంజీవి. ఈ వీడియోని సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ చేసింది. వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.." ఈ రోజు మా ఫ్యామిలీతో కలిసి వెంకీమామ సినిమాని చూడడం జరిగింది. చూడడమే కాదు బాగా ఎంజాయ్ చేశాం కూడా.. దానికి ప్రధాన కారణం మిత్రుడు వెంకటేష్ ..తన స్టైల్ అఫ్ కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్, యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా రాణించాడు. ఇక మామకి తగ్గ అల్లుడిగా నాగ చైతన్య కూడా అద్భుతంగా నటించాడని ప్రశంసల జల్లు కురిపించాడు చిరంజీవి. అంతేకాకుండా దర్శకుడు బాబీని అభినందిచాడు.
Here's what MEGASTAR Chiranjeevi garu had to say after watching #VenkyMama https://t.co/xEoFlOe0s3#MegastarAboutVenkyMama #BlockbusterVenkyMama #VictoryVenkatesh | @chay_akkineni | @dirbobby | @RaashiKhanna | @starlingpayal | @MusicThaman| @peoplemediafcy | @vivekkuchibotla
— Suresh Productions (@SureshProdns) December 18, 2019
ఇక సినిమా విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్య సరసన రాశీఖన్నా నటించింది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా సినిమాని నిర్మించాయి. తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా 50 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు.