ప్రధాని పిలుపును గౌరవిద్దాం... కరోనా చీకటిని తరిమికొడదాం : చిరంజీవి

21 రోజుల లాక్ డౌన్ విధించిన తరవాత ప్రధాని మోడీ మళ్లీ మరోసారి వీడియో సందేశం ఇచ్చారు.

Update: 2020-04-03 14:17 GMT
Megastar chiranjeevi

21 రోజుల లాక్ డౌన్ విధించిన తరవాత ప్రధాని మోడీ మళ్లీ మరోసారి వీడియో సందేశం ఇచ్చారు. 130 కోట్ల భారతీయుల ఏప్రిల్ 5 ఆదివారం రోజున రాత్రి 9 గంటలకు ఇంట్లో లైట్లు ఆపేసి, మొబైల్ టార్చ్ కూడా ఆన్ చేయవద్దని, తలుపులు మూసేసి గుమ్మం ముందు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని సూచించారు. దీనివల్ల ప్రపంచానికి ఓ సంకేతం వెళుతుందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

మోడీ ఇచ్చిన ఈ పిలుపుకు అన్ని చోట్ల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే దీనిపైన మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''మన ప్రియమత ప్రధాన మంత్రి పిలుపును గౌరవిస్తూ ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మనమంతా దివ్వెలను వెలిగించి కరోనా వల్ల ఏర్పడిన చీకటిని తరిమికొడదాం. మన దేశం ఒక్కటవుదాం, మనం ఒకరికోసం ఒకరం నిలబడతామని పునరుద్ఘాటిద్దాం'' అని పేర్కొన్నారు.

అయితే చిరంజీవి చేసిన ఈ ట్వీట్ కి మెగా అభిమానులు నుంచి మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. ఇప్పటికే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 2000 కి చేరగా, మృతుల సంఖ్య 60 కి చేరింది. 

Tags:    

Similar News