'వెంకీ మామ' సెన్సార్ పూర్తి.. టాక్ ఇలా ఉంది !

ఈ ఏడాది f2, మజీలీ సినిమాలతో ఆకట్టుకున్నారు హీరో వెంకటేష్, నాగచైతన్య.. ఇప్పుడు వీరిద్దరూ కలిసి 'వెంకీమామ' అనే మల్టీ స్టారర్

Update: 2019-12-10 13:32 GMT
venkymama

ఈ ఏడాది f2, మజీలీ సినిమాలతో ఆకట్టుకున్నారు హీరో వెంకటేష్, నాగచైతన్య.. ఇప్పుడు వీరిద్దరూ కలిసి 'వెంకీమామ' అనే మల్టీ స్టారర్ సినిమాని చేస్తున్నారు. ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా హీరోయిన్స్ గా నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ సినిమాని నిర్మించగా, బాబీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసారు.149.23 నిమిషాలు నిడివిగా సినిమా ఉంది. అయితే ఈ సినిమాను చూసిన సెన్సార్ వాళ్లు ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదని,సినిమా బాగుందని చిత్ర నిర్మాతలను ప్రత్యేకంగా అభినందిస్తూ, చిత్ర యూనిట్‌కు స్పెషల్‌గా శుభాకాంక్షలు కూడా తెలియజేసారు.

మామ అల్లుళ్ళ నేపధ్యంలో ఈ సినిమాని తెరకెక్కించాడు బాబీ. ఇందులో వెంకటేష్ రైతుగా నటిస్తే, నాగ చైతన్య ఆర్మీ జవాన్ గా నటించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపైన అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో వెంకటేష్, నాగచైతన్య వాళ్ల నిజ జీవిత పాత్రలనే పోషిస్తూ ఉండడంతో సినిమాపైన మరిన్ని అంచనాలను పెంచేశాయి. తమన్ సంగీతం అందించాడు.  

Tags:    

Similar News