రూలర్ టైటిల్ నాదే : బోయపాటి
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం `రూలర్`. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించగా, సీ కళ్యాణ్ సినిమాని నిర్మించారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం `రూలర్`. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించగా, సీ కళ్యాణ్ సినిమాని నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ నిన్న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న బోయపాటి శ్రీను సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు..
ఆ తర్వాత బోయపాటి మాట్లాడుతూ.. " రూలర్ టైటిల్ నాదేదేనని, బాలకృష్ణకు సూట్ అయ్యే టైటిల్ రూలర్ అని చెప్పుకొచ్చారు. ఆయన కోసం ఈ టైటిల్‌ను రిజిష్టర్ చేయించానని, టైటిల్‌తో పాటు ఓ సాంగ్‌ను కూడా రికార్డింగ్ చేయించుకున్నట్టు బోయపాటి చెప్పుకొచ్చారు.
ఇక రూలర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించనున్నారు. బాలకృష్ణ సరసన వేదిక, సోనాలి చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. చిరంతన్ భట్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత బోయపాటితో ఓ సినిమాని చేయనున్నారు బాలకృష్ణ. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ లాంటి సినిమాలు వచ్చి మంచి హిట్టయ్యాయి. జనవరిలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్నాడు.