బిగ్ బాస్ హౌస్ ని భాగోద్వేగంతో నింపేసిన పునర్నవి ...

Update: 2019-08-03 10:08 GMT

బిగ్ బాస్ అంటే ఎప్పుడు గొడవలేనే , కాంట్రవర్సీలేనే అనుకునే వాళ్ళకి కొత్తగా కనిపించింది నిన్నటి ఎపిసోడ్ .. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరినైనా కోల్పోయి ఉంటే షేర్ చేసుకోవాలని బిగ్ బాస్ కోరాడు . అయితే ఎవరి ఫీలింగ్స్ వారు చెప్పుకొచ్చారు . అందులో పునర్నవి తన జీవితంలో చోటు చేసుకున్న ఓ సంఘటనను చెబుతూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది . అంతే కాకుండా మొత్తం బిగ్ బాస్ హౌస్ ని కూడా ఎమోషనల్ తో నింపేసింది .

"నేను మొదటగా ఓ అబ్బాయిని ప్రేమించాను . అతను నన్న కొట్టేవాడు . దీనితో అతని నుండి నేను విడిపోయాను. అ తర్వాత చాలా రోజులు నేను డిప్రెషన్ కి లోనయ్యాను . మా అమ్మ నేను ఒకే ఇంట్లో ఉన్నా మాట్లాడుకోలేదు .ఇలాంటి టైం లో నాకు రామ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పరిచయం నాకు గతాన్ని మరిచిపోయేలా చేసింది . అతను నన్ను బాగా చూసుకునేవాడు .కొద్దిరోజుల తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది . అతను నన్ను కన్విన్స్ చేసేందుకు బాగా ట్రై చేసాడు. కానీ నా మొండితనం మరియు కోపం వల్ల అతనికి దూరంగా ఉన్నాను . అతను కొలంబోలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడని తెలుసుకొని చాలా షాక్ కి గురయ్యాను .. అతని చావుతో నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పుకుంటూ పునర్నవి చెబుతూ చాలా ఎమోషనల్ కి గురయ్యింది .. 

Tags:    

Similar News