బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా రాజ్యమేలుతున్న బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ లభిస్తుంది . థర్డ్ సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతుందని చెప్పాలి .. ఇప్పటికే నాలుగు వారలు కంప్లీట్ చేసుకోనుంది . కాబట్టి ఫోర్త్ ఎలిమినేషన్ కి రంగం సిద్దం అయింది. అయితే షో నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది . ఈ వారం శివజ్యోతి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్, రోహిణి ఎలిమినేషన్ జోన్ లో ఉండగా, శివజ్యోతి, వరుణ్ సందేశ్ సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్టు నిన్న రాత్రి ఎపిసోడ్ లోనే నాగ్ ప్రకటించేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం రోహిణి ఈ వారం ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది . దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు రాత్రి ప్రసారం కానుంది ..