Bhoomika Chawla: ఆ సినిమాలో నన్ను తీసేసి వేరే హీరోయిన్‌ను పెట్టారు

Bhoomika Chawla: బాలీవుడ్ లో పడ్డ ఇబ్బందుల గురించి చెబుతున్న భూమిక

Update: 2023-04-26 15:00 GMT

Bhoomika Chawla: ఆ సినిమాలో నన్ను తీసేసి వేరే హీరోయిన్‌ను పెట్టారు

Bhoomika Chawla: ఒకప్పుడు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన భూమిక చావ్లా తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్లను అందుకుంది. ఆ తరువాత బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ అనుకున్న విజయాలను మాత్రం అందుకోలేక పోయింది. తాజాగా ఈ మధ్యనే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో మాట్లాడుతూ బాలీవుడ్లో ఆమె ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాల గురించి మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది భూమిక.

గతంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "తేరే నామ్" సినిమాలో కూడా భూమిక వేరే సినిమాలకు కూడా సైన్ చేసింది కానీ ఆ సినిమాలలో చేయలేదు. కానీ తీరా చూస్తే ఆ సినిమాలు నుంచి కావాలనే కొందరు భూమిక ను తప్పించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా భూమికనే చెప్పారు. "ఏడాది పాటు మరే సినిమా ఒప్పుకోకుండా ఆ సినిమా కోసం చూస్తే చివరి నిమిషంలో సినిమా నుంచి తొలగించారు," అని చెప్పుకొచ్చింది భూమిక.

అంతేకాకుండా "జాబ్ వి మెట్" సినిమాలో కూడా మొదట భూమికా నే హీరోయిన్ గా అనుకున్నారట. అప్పుడు బాబీ డియోల్ హీరోగా చేస్తారని అన్నారట. కానీ తర్వాత షాహిద్ కపూర్ హీరోగా మారాక భూమిక స్థానంలో కరీనాకపూర్ ని ఎంపిక చేశారని అన్నారు. "మున్నాభాయ్ ఎంబీబీఎస్", మణిరత్నం "కన్నతిల్ ముత్తమిట్టల్" సినిమాలలో కూడా హీరోయిన్గా సైన్ చేసిన భూమిక ఆ సినిమాల నుండి తొలగించబడిందట. బాలీవుడ్ లో ఇలా తనకి చాలానే చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది భూమిక.

Tags:    

Similar News