మోక్షజ్ఞ లుక్ వైరల్
ఇప్పటికే సీనియర్ హీరోలు తమతమ వారసులను రంగంలోకి దించారు.
ఇప్పటికే సీనియర్ హీరోలు తమతమ వారసులను రంగంలోకి దించారు. ఇక బాలయ్యదే లేట్.. మోక్షజ్ఞ వెండితెరకి ఎప్పుడు పరిచయం అవుతాడా అని ఇటు ఇండస్ట్రీతో పాటు అటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ పాలనా దర్శకుడితో ఉంటుందని చాలా వార్తలు వచ్చాయి. కానీ అవి వార్తల వరకు మాత్రమే మిగిలిపోయాయి. వెండితెరపైకి మాత్రం రాలేదు.
మోక్షజ్ఞ ఎంట్రీ బోయపాటి, క్రిష్ లాంటి దర్శకులతో ఉంటుందని ప్రముఖంగా వార్తలు వినిపించాయి. కానీ కుదరలేదు. అయితే తాజాగా మోక్షజ్ఞ కి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో మోక్షజ్ఞ చాలా లావుగా కనిపిస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ రూలర్ లుక్ లో కనిపిస్తూ ఉంటే అయనతో పాటు కూతురు తేజస్విని, అల్లుడు భరత్, భార్య వసుంధర కూడా ఉన్నారు.
ఇక బాలకృష్ణ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం కే యస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాని సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన వేదిక, సోనాలి చౌహాన్ నటిస్తున్నారు. వచ్చే నేల డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.