బాలయ్య - బోయపాటి నూతన చిత్రం ప్రారంభం

సింహ, లెజెండ్ సినిమాల తరవాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

Update: 2019-12-06 06:27 GMT
Balakrishna Boyapati new movie started

సింహ, లెజెండ్ సినిమాల తరవాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమాని ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌లో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.. ఈ సినిమాలో బాలకృష్ణ సరనస జెర్సీ మూవీ ఫేం శ్రద్ధా శ్రీనాద్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా, రోజా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇక సింహ, లెజెండ్ సినిమాలతో బాలకృష్ణ, బోయపాటి మంచి కాంబినేషన్ ని తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ముద్ర పడిపోయింది. ఈ రెండు సినిమాలు భారీ హిట్టు కావడంతో ఇప్పుడు ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ కే. యస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ అనే సినిమాని చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్న ఈ సినిమా క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. వేదిక, సోనాలి చౌహాన్ కథానాయకులుగా నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Delete Edit



Tags:    

Similar News