బట్టతల ఉందా? అయితే ఈ ట్రైలర్ మీకోసమే...

Update: 2019-10-10 10:56 GMT

బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఎంత గొప్ప నటుడో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.. మరో ఇంట్రెస్టింగ్ కథతో మెప్పించడానికి అయన సిద్దం అయ్యాడు.. బట్టతల వల్ల కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయో ఫన్నీగా చెప్పడానికి 'బాలా'అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబందించిన ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.. ఈ సినిమాలో ఆయుష్మాన్ బట్టతల ఉన్నా కుర్రాడి పాత్రలో కనిపించనున్నారు. బట్టతల ఉండడం వల్ల బాలా చాలా ఇబ్బందులు పడుతుంటాడు.

పోనీ విగ్ పెట్టుకుందామా అంటే అది ఉడిపోయి అందరిముందు నవ్వుల పాలు అవుతూ ఉంటాడు.. మార్కెట్‌లో దొరికే ఆయుర్వేదం నూనెలు కూడా కొనుక్కుని వాడుతూ ఉంటాడు. అయినా అతనికి జుట్టు పెరగదు. చివరికి ఆవు పేడను కూడా తలకు రాసుకుంటాడు. అయినా ఏం లాభం ఉండదు. దీనితో అతను ఓ డాక్టర్ కి వెళ్లి తన బాధను చెప్పుకుంటాడు. ఆ డాక్టర్ చెప్పింది విన్నాక ఆయుష్మాన్ అక్కడి నుండి పారిపోతాడు. పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు.. ఇందులో యామి గౌతమ్, భూమి పెడ్నేకర్ కథానాయికలుగా నటించారు. నవంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

.Full View

Tags:    

Similar News