వంటలక్క కూతురికి మహేష్ సినిమాలో ఛాన్స్..

Update: 2019-11-10 05:00 GMT
Mahesh babu,baby krithika

మాటీవీలో వచ్చే కార్తీకదీపం సీరియల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు.. ఈ సీరియల్ కి చాలా మంది హార్ట్ కోర్ ఫాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ సీరియల్ అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో ముందుకు సాగుతుంది. మొన్నటివరకు వచ్చిన బిగ్ బాస్ 3 షో కూడా దానిని బీట్ చేయలేకపోయింది. ఈ సీరియల్ లో మెయిన్ రోల్ అయిన దీపకి కూతురుగా బేబీ క్రితిక సౌర్య అనే పాత్రలో యాక్ట్ చేస్తోంది.

ఇప్పుడు బేబీ క్రితిక కి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఆదరిపోయే ఛాన్స్ వచ్చింది. మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో బేబీ క్రితికకి ఓ ముఖ్యమైన పాత్ర దక్కింది. ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీం అంతా కలిసి ఓ గ్రూప్ ఫోటో దిగారు. అందులో బేబీ క్రితిక కూడా ఉంది.

ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా, అలనాటి తార విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. దిల్ రాజు,అనిల్ సుంకర, మహేష్ బాబు ఈ సినిమాని కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12 న సినిమాని విడుదల చేయనున్నారు. 




 


Tags:    

Similar News