Love story : నుంచి ఏయ్ పిల్లా ... సాంగ్ విడుదల
ప్రేమ కథలను అందంగా తెరపైకి ఎక్కించడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల రూటే సపరేటు.. అందులో భాగంగా ఆనంద్, హ్యాపీడేస్, లైఫ్ ఇజ్ బ్యుటిపుల్, ఫిదా
ప్రేమ కథలను అందంగా తెరపైకి ఎక్కించడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల రూటే సపరేటు.. అందులో భాగంగా ఆనంద్, హ్యాపీడేస్, లైఫ్ ఇజ్ బ్యుటిపుల్, ఫిదా లాంటి చిత్రాలు వచ్చి మంచి ఘన విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అదే తరహాలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల .. ఈ సినిమాకి 'లవ్‌స్టోరీ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సినిమాకి సంబంధించిన 'ఏయ్ పిల్లా' అనే ప్రివ్యూ వీడియోను రిలీజ్ చేశారు. నిమిషం ఆరు సెకండ్స్ ఉన్న ఈ వీడియోలో సాయిపల్లవి, నాగచైతన్య జంట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక హోలీ సందర్భంగా మార్చి 11న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఫుల్ లిరికల్ వీడియోని విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాని ఎమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్‌దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నారు. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.
పరుశురాంతో చైతూ :
ఈ సినిమా తరవాత గీతా గోవిందం ఫేం పరుశురాంతో ఓ సినిమాని చేయనున్నాడు నాగచైతన్య.. ఇది నాగ చైతన్యకి 20వ సినిమా. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. రష్మిక మందన్నా కథానాయకగా నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకువెళ్లనుంది. ఈ సినిమాకి నాగేశ్వర్ రావు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.