జబర్దస్త్‌ నటుడు.. వినోద్‌ పై హత్యాయత్నం..

Update: 2019-07-20 09:15 GMT

జబర్దస్త్‌ నటుడు.. వినోద్‌ అలియాస్‌ వినోదినిపై హత్యాయత్నం జరిగింది. ఇంటి గొడవలకు సంబంధించి వినోద్‌పై దాడి జరిగింది. ఇంటి కొనుగోలుకు సంబంధించి.. ఇద్దరు వ్యక్తులకు 10 లక్షలు నగదు ఇచ్చినట్లు వినోద్‌ చెబుతున్నాడు. అయితే రిజిస్ట్రేషన్‌ చేయించకపోవడంతో పాటు.. డబ్బులు వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని వినోద్‌ ఆరోపిస్తున్నాడు. సెటిల్మెంట్‌ చేసుకుందామని రమ్మని చెప్పి.. తనపై హత్యాయత్నం చేశారని.. చెబుతున్నారు. ఈ ఘటనలో వినోద్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వినోద్‌ చికిత్స పొందుతున్నాడు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Full View

Tags:    

Similar News