ఈమె ఒకప్పటి మెగాస్టార్ హీరోయిన్... ఇప్పుడు గుర్తు పట్టండి చూద్దాం!

90 దశాబ్దంలోని హీరోయిన్స్ ని గుర్తుపట్టడం పెద్ద విషయం ఏమి కాకపోవచ్చు.. కానీ ఇక్కడ కనిపిస్తున్న హీరోయిన్ మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.

Update: 2019-11-17 10:03 GMT
Meenakshi Seshadri

90 దశాబ్దంలోని హీరోయిన్స్ ని గుర్తుపట్టడం పెద్ద విషయం ఏమి కాకపోవచ్చు.. కానీ ఇక్కడ కనిపిస్తున్న హీరోయిన్ ఓ సినిమాలో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఆమె అసలు గుర్తుపట్టకుండా ఉంది. ఇంతకీ ఆమె ఎవరంటే ... ! కళాతపస్వి కే విశ్వనాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆపద్భాంధవుడు సినిమాలోని హీరోయిన్ .ఆమె మీనాక్షి శేషాద్రి. ఔరా అమ్మక చెల్లా.. ఆలకించి నమ్మడమెల్లా అంటూ చిరుతో కలిసి స్టెప్పులు వేసింది. ఈ సినిమాకి గాను ఆమెకి బెస్ట్ హీరోయిన్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి అవార్డు అందుకుంది.

మీనాక్షి శేషాద్రి మంచి యాక్టర్ మాత్రమే కాదు. మంచి డాన్సర్ కూడా...  ఇక చివరగా ఆమె తెలుగులో టి.సుబ్బిరామిరెడ్డి నిర్మించిన స్వామి వివేకానంద సినిమాలో నటించింది.ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ చాలా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తన భర్త హరీష్ మైసూర్ తో కలిసి అమెరికాలో ఉంటుంది. పెళ్లి అయ్యాక మళ్ళీ కొందరు హీరోయిన్స్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మీనాక్షి శేషాద్రికి కూడా ఆఫర్స్ వస్తున్నప్పటికీ మళ్ళీ ఆమె సినిమాలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదట..   

Tags:    

Similar News