ఏపీ డిప్యూటీ సీఎం ఏంటి ? సినిమాల్లో నటించడం ఏంటి అనుకున్నారా ? అవును మీరు చదివింది నిజమే .. ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పాముల పుష్ప శ్రీవాణి 'అమృత భూమి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె ఓ ఉపాధ్యాయురాలు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబధించిన షూటింగ్ ని విజయనగరం జిల్లాలో చేసారు . ఈ షూటింగ్ లో పుష్ప శ్రీవాణి పాల్గొన్నారు. గొరడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఆమె పై ఓ సీన్‌ను షూట్ చేశారు. షూటింగ్ అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యవసాయం మరియు ప్రకృతి యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధింగా మరియు ప్రోత్సహించేలా సినిమా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమాలో మరో పాత్రలో కలెక్టర్ హరిజవహర్‌లాల్ కూడా కనిపించనున్నారు.