Anushka Shetty: అతడితోనే తలవంచి తాళి కట్టించుకుంటా.. పెళ్లి రూమర్స్ పై అనుష్క

Update: 2020-02-24 04:57 GMT
Anushka shetty (File Photo)

మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్‌ హీరోయిన్లలో అనుష్క ముందు ప్లేస్ లో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. అక్కినేని నాగార్జున హీరోగా, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది అనుష్క.. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి చిత్రం అనుష్కని టాప్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిపింది. ఇక ఆ తర్వాత విక్రమార్కుడు, మిర్చి, బాహుబలి, రుద్రమదేవి చిత్రాలలో నటించి ఎక్కడలేని క్రేజ్ ని తన సొంతం చేసుకుంది.

ఇక ఇది ఇలా ఉంటే అనుష్క పెళ్లిపై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. హీరో ప్రభాస్ తో అనుష్క ప్రేమలో ఉందని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో ఆ ప్రచారాన్ని కొట్టిపారేసింది కూడా.. పోనీ అంతటితో ఆగిపోయయా అంటే అది లేదనే చెప్పాలి. అనుష్క ఓ క్రికెటర్‌తో ప్రేమలో ఉందని, త్వరలో అతన్నే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. ఈ నేపద్యంలో స్వీటీ మరోసారి తన పెళ్లి వార్తలపై స్పందించింది.

'ప్రస్తుతం నేను ఎవరితోనూ ప్రేమలో లేను. నేను ప్రేమలో ఉన్నట్లు తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. అవి నాకు చాలా బాధకలిగిస్తాయి. అలాంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నా తల్లిదండ్రులు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటారో అతడితోనే తలవంచి తాళి కట్టించుకుంటానని' అని అనుష్క పేర్కొంది.

ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. గత కొద్దిరోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. అంజలి, మాధవన్, శాలిని పాండే ముఖ్యపాత్రలు పోషించారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయిగా నటించింది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. 

Tags:    

Similar News