Anushka Shetty: సినిమాలు వదిలేస్తా.. ప్రభాస్‌తో ఫ్రెండ్ షిప్ మాత్రం వదులుకోను : అనుష్క

ప్రభాస్, అనుష్క .. ఈ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇప్పటివరకు వీరు బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాలలో కలిసి నటించారు.

Update: 2020-03-19 08:54 GMT
Anushka Shetty, Prabhas

ప్రభాస్, అనుష్క .. ఈ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇప్పటివరకు వీరు బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాలలో కలిసి నటించారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండు అని కోరుకొని అభిమాని ఉండడు కావచ్చు.. కానీ మేమిద్దరం మంచి స్నేహితులమని వీరిద్దరూ చాలా సార్లు వెల్లడించారు. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేసింది అనుష్క..

తాజాగా అనుష్క నటించిన చిత్రం "నిశబ్దం".. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 2 న సినిమాని రిలీజ్ చేయనున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఓ షోలో పాల్గొన్న అనుష్క.. ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సుమ ప్రభాస్ ఫొటో పట్టుకుని ఇతని గురించి ఒక పాజిటివ్ పాయింట్ చెప్పండి అని అనడంతో నా కొడుకు గురించా అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది అనుష్క.

అంతేకాకుండా మీ ఇద్దరిలో ఒకే పోలికలు ఉన్నాయి కదా అని సుమ అనగా ' నా కొడుకు కదండీ మరి నా పోలికలే ఉంటాయి' అని అనుష్క మరో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఇక ప్రభాస్ కోసం మీరు ప్రభాస్‌తో ఫ్రెండ్ షిప్ మానేస్తారా? లేక సినిమాలు వదులుకుంటారా? అని సుమ అడగగా అనుష్క ఆలోచించకుండా సినిమాలనే వదులుకుంటానని, ప్రభాస్‌తో ఫ్రెండ్ షిప్ మాత్రం వదులుకోనని అనుష్క చెప్పుకొచ్చింది.

ఇక తాజాగా అనుష్క నటిస్తున్న "నిశబ్దం" మూవీలో ఓ ముగ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. అనుష్కతో పాటు మాధవన్, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తదితరులు నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సినిమా ఎక్కువ భాగం అమెరికాలో చేశారు. ఇక భాగమతి తర్వాత అనుష్క చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Full View


Tags:    

Similar News