ఎట్టకేలకు నిశబ్దం రిలీజ్ డేట్ ఫిక్స్
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క... అందులో భాగంగానే అరుంధతి, భాగమతి, పంచాక్షరి లాంటి సినిమాలు వచ్చి
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క... అందులో భాగంగానే అరుంధతి, భాగమతి, పంచాక్షరి లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా అనుష్కకి స్టార్ హీరోలతో సమానంగా పేరు కూడా వచ్చింది. ఇప్పుడు నిశబ్దం అంటూ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుష్క.. అదే 'నిశబ్దం'.. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి మాత్రం నోచుకోవడం లేదు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా విడుదల తేదిని ఎట్టకేలకు ప్రకటించారు. ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో సాక్షి అనే ముగ అమ్మాయి పాత్రలో అనుష్క నటించింది. దాదాపుగా ఎక్కువ భాగం షూటింగ్ ని విదేశాల్లోనే తెరకెక్కించారు. అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల, మైకేల్ మ్యాడ్సన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. విలన్గా నటిస్తోన్న హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ నటిస్తున్నారు.
#Silence will release on 2 April, 2020! Stay tuned for more updates! #SilenceFromApril2nd @ActorMadhavan #AnushkaShetty @yoursanjali @actorsubbaraju @hemantmadhukar #TGVishwaprasad @konavenkat99 @vivekkuchibotla @peoplemediafcy @KonaFilmCorp @GopiSundarOffl @MangoMusicLabel pic.twitter.com/g2lhYrbOIx
— KonaFilmCorporation (@KonaFilmCorp) February 8, 2020
ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. కోన వెంకట్ స్క్రీన్ ప్లే, డైలాగులు రాశారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి.