ముగజీవాల కోసం ఒక్కరూపాయి ఇచ్చినా చాలు : రష్మీ

జబర్దస్త్ యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు..

Update: 2020-03-31 14:24 GMT

జబర్దస్త్ యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.. ఇక ముగాజీవల పైన కుడా చాలా ప్రేమను చూపిస్తోంది రష్మీ.. ఇక ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో, పేద కూలీలు, ముగాజీవలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ నేపధ్యంలో లైవ్ లోకి వచ్చిన రష్మి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌తో వలస కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది సమయానికి తిండి కూడా తినడంలేదు. మూగజీవాలు ఆకలికి అలమటించడం ఆవేదన కలిగిస్తోందని, ఆహారం పెట్టేవారు లేక అవి చనిపోతున్నాయని కన్నీటి పర్యంతం అయింది.

మానవ దృక్పథంతో ముగాజీవాలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరింది. మూగజీవాల కోసం ఒక్క రూపాయి ఇచ్చినా అది ఎంతో ఉపయోగపడుతుందని రష్మీ పేర్కొంది. ఇక రష్మీ తనకి దగ్గరలో ఉన్న శునకాలకు స్వయంగా ఆహారం పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్‌ చేశారు. ఇక కరోనా వైరస్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా పీఎం-కేర్స్‌ ఫండ్‌కు రూ.25 వేలు విరాళంగా ఇచ్చారు. 


Tags:    

Similar News