Anchor Omkar Condense the Rumours: క‌రోనా వార్త‌ల‌ని ఖండించిన యాంకర్ ఓంకార్!

Anchor Omkar Condense the Rumours: కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది.. ఎక్కడ చూసినా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా ఎవరిని వదలడం లేదు.

Update: 2020-06-28 08:01 GMT

Anchor Omkar Condense the Rumours: కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది.. ఎక్కడ చూసినా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా ఎవరిని వదలడం లేదు.. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటే కొందరు మాత్రం పలువురు సెలబ్రిటీలకి కరోనా సోకిందని అబద్ధపు వార్తలను పుట్టిస్తూ అభిమానులను ఆందోళనలకు గురి చేస్తున్నారు . అందులో భాగంగానే యాంకర్, దర్శకుడు ఓంకార్‌ సోకిందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది.. అయితే దీనిపైన ఓంకార్ స్పందించారు..

దర్శకుడు ఓంకార్ కి ఈ నెల 24 న కరోనా లక్షణాలు కనిపించాయని, దీనితో వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కరోనా పాజిటివ్ అని వచ్చిందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఓంకార్ ఫ్యామిలీ కూడా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నట్టుగా న్యూస్ స్ప్రెడ్ అయింది. దీనితో ఆ వార్తలపై ఓంకార్ స్పందించారు.. తనకు తన కుటుంబానికి కరోనా సోకింది అనడంలో ఎటువంటి నిజం లేదని ఓంకార్ క్లారిటీ ఇచ్చారు.. అయితే కరోనా టెస్ట్ లు చేసుకోగా అందులో నెగిటివ్ వచ్చినట్టుగా ఓంకార్ వెల్లడించారు. ఇక సోమవారం నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నాట్టుగా ఓంకార్ వెల్లడించారు..

జీతెలుగులో వచ్చే ఓ షో కి ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.. ఇక రాజు గారి గది సిరీస్ లతో ఓంకార్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు.. ప్రస్తుతం తమన్నా ప్రధాన పాత్రగా రాజు గారి గది నాలుగో పార్ట్ కి ప్లాన్ చేస్తున్నాడు ఓంకార్..

ఇక దేశంలో కరోనా ఉధృతి పెరిగిపోతుంది. రికార్డుస్థాయిలో రోజురోజుకీ కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల్లో 19,906 కేసులు నమోదు కావడంతో దేశంలో కేసుల సంఖ్య 5,28,859 దాటేయగా.. మరణాల సంఖ్య 16,095కు చేరాయి. నిన్న ఒక్క రోజే 410 మంది కరోనాతో మరణించారు. 

Tags:    

Similar News