మరో ఛాన్స్ కొట్టేసిన అనసూయ.. ?

Update: 2019-11-02 14:31 GMT
anchor anasuya

బుల్లితెరపై యాంకర్ గా ఆదరగోడుతుంది అనసూయ.. జబర్దస్త్ షోలు చేసుకుంటూనే మరికొన్ని ప్రోగ్రాంలకి యాంకర్ గా చేస్తుంది. మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు సినిమాల్లో కూడా నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది అనసూయ..

ఈ సినిమాతో అనసూయకి చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ పాత్రల ఎంపీక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది అనసూయ . అందులో భాగంగానే తాజాగా మరోసారి సుకుమార్ దర్శకత్వంలో అనసూయ నటిస్తుందని తెలుస్తుంది. ఈ మధ్యే సుకుమార్ అల్లు అర్జున్ సినిమా మొదలైన సంగతి తెలిసిందే.. ఇందులో ఓ ముఖ్యమైన పాత్రలో అనసూయ నటిస్తుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    

Similar News