మరో లక్కి ఛాన్స్ కొట్టేసిన అనసూయ?

ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుంది. హాస్యనటుడు బ్రహ్మనందం ఓ ముఖ్యపాత్రలో

Update: 2019-11-26 05:03 GMT
Anasuya

బుల్లితెరపైన బిజీ యాంకర్ గా కొనసాగుతుంది యాంకర్ అనసూయ.. యాంకర్ గానే కాకుండా మంచి పాత్రలు దక్కినప్పుడు వెండితెరపైన కూడా మెరుస్తుంది. అందులో భాగంగానే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషించి మంచి పేరు సంపాదించుకుంది అనసూయ.. రంగమ్మత్త పాత్రలో అనసూయ నటనకి విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు.

అయితే ఇప్పుడు ఆమెకి మరో మంచి పాత్ర దక్కిందని తెలుస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకేక్కేబోతున్న రంగమార్తాండ సినిమాలో అనసూయకి మంచి పాత్ర దక్కిందని తెలుస్తుంది. ఇందులోని ఓ ముఖ్యపాత్ర కోసం దర్శకుడు కృష్ణవంశీ అనసూయని సంప్రదించాడని, ఆ పాత్రకి కూడా అనసూయ ఒకే చెప్పిందని టాక్ నడుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుంది. హాస్యనటుడు బ్రహ్మనందం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. నిన్న (సోమవారం) విశాఖపట్నంలో షూటింగ్ ప్రారంభం అయింది. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మరాఠీ భాషలో మంచి హిట్టైనా నటసామ్రాట్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Tags:    

Similar News