సినీనటి అమలాపాల్ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా కేరళలోని తన ఇంట్లోనే ఉంటున్న అమలాపాల్ వర్షం కురవడంతో ఆనందంతో గంతులేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తోంది. ఇక ఈ వీడియోకు "ఏదైనా తొలిసారి జరిగితే అది ప్రత్యేకమే. లాక్ డౌన్ సమయంలో తొలి వర్షం. ఓహ్... 2020లో తొలి మామిడికాయలు. వర్షం అనేది విశ్వం నుంచి అందే శుభ సంకేతం... డీఓపీ (డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ), డైలాగ్స్: మామ్" అని క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.