అల వైకుంఠపురములో టీజర్ అప్పుడే...?

Update: 2019-09-11 14:37 GMT

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం..ఇందులో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సుశాంత్,నవదీప్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా అలనాటి తార టబు ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని దసరాకి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట.. ముందు ఈ సినిమా ట్రైలర్ ని త్రివిక్రమ్ పుట్టినరోజు అయిన నవంబర్07 న రిలీజ్ చేద్దాం అనుకున్నారట కానీ ఆ ఆలోచన విరమించుకొని దసరాకి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్నారు..తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Tags:    

Similar News