పోలీస్ స్టేషన్ లో తలకిందులుగా అల్లరి నరేష్ .. ఏమైంది?
ఈ సినిమా ఈ రోజు రామానాయుడు స్టూడియోలో మొదలైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ హాజరై క్లాప్ ని ఇచ్చారు.
దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రెండో కొడుకుగా, రవిబాబు దర్శకత్వం వహించిన అల్లరి సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో నరేష్.. మొదటి సినిమాతోనే మంచి హిట్టు కొట్టి ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత హాస్యపు ప్రధానమైన చిత్రాలలో నటించి మినిమం గ్యారెంటీ హీరో అని అనిపించుకున్నాడు. అంతేకాకుండా ఈ తరం రాజేంద్రప్రసాద్ గా పేరు సంపాదించుకున్నాడు నరేష్.. మొదట్లో నరేష్ కి మంచి హిట్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత మూస కథలనే తీయడంతో సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.
ఈ నేపధ్యంలో మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమాలో నటించి మెప్పించాడు నరేష్..ఈ సినిమాలో అతని పాత్రకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా మంచి హిట్టు కావడంతో కథల ఎంపికలో జాగ్రత్తలు వ్యవహరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే బంగారు బుల్లోడు అనే సినిమాని మొదలు పెట్టాడు. అంతేకాకుండా మరో కొత్త సినిమాకి శ్రీకారం చూట్టాడు. విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు చెప్పిన నాంది అనే కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ సినిమా ఈ రోజు రామానాయుడు స్టూడియోలో మొదలైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ హాజరై క్లాప్ ని ఇచ్చారు. ఇక ఈ సినిమాని దర్శకుడు వేగేశ్నసతీష్ ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో అల్లరి నరేష్ మొఖం మీదా గాయలతో కనిపిస్తున్నాడు. ఇక ఈ రోజు రిలీజ్ చేసిన రెండవ పోస్టర్లో నరేష్ పోలీస్ స్టేషన్ లో ఒంటిపై నూలుపోగు లేకుండా చైన్స్‌తో తలకిందులుగా వేలాడదీసి కనిపిస్తున్నాడు. ఈ రెండు పోస్టర్స్ సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ సినిమాలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ప్రముఖ పాత్రలో నటిస్తోంది. శ్రీ చరణ్ పాకల సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాని ఈఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.
Turning it around....in #Naandhi - A New Beginning. #Naresh57 @SV2Ent @Vijaykanakamed2 @varusarath @SatishVegesna @ChotaKPrasad @brahmakadali @RajeshDanda_ @UrsVamsiShekar @abburiravi pic.twitter.com/diE9F7vjbr
— Allari Naresh (@allarinaresh) January 20, 2020