'అల' టీజర్ రెడీ అవుతుంది

వచ్చే సంక్రాంతికి పోటికి రెడీ అవుతున్నాయి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలు

Update: 2019-11-26 07:47 GMT
Pic from Ala vaikuntapuram lo

వచ్చే సంక్రాంతికి పోటికి రెడీ అవుతున్నాయి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలు.. పోటిలో ఇంకా సినిమాలు ఉన్నప్పటికీ వార్ మాత్రం ఈ రెండు సినిమాల మధ్యే నడవబోతుంది.. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదల అవుతుంటే, అల వైకుంఠపురములో సినిమా జనవరి 12న విడుదల అవుతుంది.

ఇప్పటికే అల వైకుంఠపురములో నుండి మూడు పాటలు విడుదలై రికార్డులని బద్దలు కొడుతున్నాయి. దానికి తోడు సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్స్ కూడా సినిమాపైన భారీ అంచనాలను పెంచేశాయి.. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి ఇప్పటికే చిత్ర టిజర్ ను బయటకు వదిలింది చిత్ర బృందం.. మహేష్ బాబు గత సినిమా రికార్డులను బద్దలు కొడుతూ యూట్యూబ్ లో 20 మిలియన్ల వ్యూస్ రాబట్టింది.

ఇప్పుడు బన్ని వంతు వచ్చేసింది. సరిలేరు నీకెవ్వరు టిజర్ ని బీట్ చేయాలంటే అల వైకుంఠపురములో నుండి టిజర్ ని బయటకు వదలాలని చిత్ర యూనిట్ భావిస్తుందట.. మొత్తం 55 సెకెండ్లతో కూడి ఉన్న టిజర్ ని రెడీ చేస్తుందట చిత్ర యూనిట్.. ప్రస్తుతం ఫినిషింగ్ లో ఉన్న అల వైకుంఠపురములో షూటింగ్ కి డిసెంబర్ మొదటివారంలో గుమ్మడికాయ కొట్టేయనున్నారు. డిసెంబర్ చివరివారంలో చిత్ర ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.   

Tags:    

Similar News