అక్కినేని అమల రీఎంట్రీ .. ఈ హీరోకి అమ్మగా

Update: 2019-11-01 12:50 GMT

అక్కినేని నాగార్జునని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు చేయడం మానేసింది అమల.. చాలా సంవత్సరాల తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో నటించింది.. ఆ తర్వాత ఓ హిందీ సినిమాలో కూడా నటించింది అమల.. ఆ తర్వాత సినిమాలు ఏమి చేయకుండా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తుంది.

ఇప్పుడు మళ్ళీ శర్వానంద్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది అమల.. ఇందులో ఆమె హీరో తల్లి పాత్రలో నటిస్తుంది. ఆమె పాత్ర సినిమాలో కీలకం కానుందని చిత్ర యూనిట్ చెప్పుకొస్తుంది. ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ర‌విచంద్రన్ తండ్రి ర‌వి రాఘ‌వేంద్ర తండ్రి పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర్వానంద్‌, అమ‌ల అక్కినేని, ర‌వి రాఘ‌వేంద్రపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు శ్రీ కార్తిక్.. రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. 

Tags:    

Similar News