Rajamouli RRR లో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

Update: 2020-01-21 07:01 GMT

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

దాదాపుగా 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ చిత్రం. ఇక రాజమౌళి ఇటీవలే ఎన్టీఆర్ పై విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించగా, ప్రస్తుతం షూటింగ్ వికారాబాద్ అడవుల్లో కీలక సన్నివేశాలను చిత్రికరిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే అజయ్ దేవగన్ ఆయన ఈరోజు షూటింగ్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఓ పిక్‌ను చిత్రబృందం ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.

దాదాపుగా 10 భాషలలో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాని జులై 30 న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

అజయ్ దేవగన్ తాజాగా తానాజీ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వ‌ద్ద దూసుకువెళ్తుంది.. ఓమ్ రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.


 

Tags:    

Similar News