గుండెపోటుతో ప్రముఖ నటి మృతి

ప్రముఖ నటి ఉషా గంగూలీ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Update: 2020-04-24 14:51 GMT
Actress usha ganguli

ప్రముఖ నటి ఉషా గంగూలీ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.తన ఫ్లాట్‌లో ఉషా గంగూలీ విగతజీవిగా పడి ఉండడం గమనించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆమె భర్త కమలేందు కొన్నేళ్ల క్రితం మరణించారు. ఆమె సోదరుడు కూడా మూడు రోజుల ముందే మరణించాడు. ఉషా గంగూలీ మృతికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు..

చిత్ర పరిశ్రమకి ఆమె చేసిన కృషిని గుర్తుచేసుకున్న మమతా 2016 లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఉషా గంగూలీకి గిరీష్ సమ్మన్ గౌరవాన్ని అందజేసిందని అన్నారు. ఆమె కుటుంబానికి, స్నేహితులకు, అనుచరులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నట్లు మమతా బెనర్జీ బెంగాలీలో ఒక ప్రకటనలో తెలిపారు. ఇక సినీ ప్రముఖులు షబానా ఆజ్మీ, అపర్ణాసేన్ మొదలగు వారు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు..

ఉషా గంగూలీ జోధ్‌పూర్‌‌లో జన్మించారు. చిన్నతనంలో భరతనాట్యం, హిందీ సాహిత్యం నేర్చుకున్నారు. నాటక రంగంలో ప్రవేశించి మహాభోజ్, రుడాలి, కోర్ట్ మార్షల్స్, ఆంతర్యాత్ర లాంటి నాటకాల్లో నటించి టాలెంట్ బయటపెట్టారు. నాటకాల్లోనే కాకుండా అజయ్ దేవగణ్, ఐశ్వర్యరాయ్ నటించిన రెయిన్ కోట్ చిత్రానికి దర్శకురాలు రితుపర్ణో ఘోష‌తో కలిసి కథను అందించారు. ఆమె అంత్యక్రియలు ముగిశాయి.  

Tags:    

Similar News