అప్పట్లో రజినీకాంత్ కి మొహమాటం ఎక్కువ ... సుహాసిని

Update: 2019-07-13 12:55 GMT

తాజాగా చెన్నైలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ 89వ జయంతి వేడుకలు జరిగాయి . అయితే దీనికి పలువురు తమిళ నటులు హాజరయ్యారు . ఈ నేపధ్యంలో ఒక్కప్పటి నటి సుహాసాని మాట్లాడుతూ.. తొలిసారి నేను చుసిన సినిమా షూటింగ్ 'మూండ్ర ముడిచ్చు' .. ఈ సినిమా షూటింగ్ మా ఇంటి వెనుకాలే జరిగేదని ఆ సినిమాలో నటించిన రజినీకాంత్ అప్పట్లో సినిమా పరిశ్రమకి కొత్త కావడంతో మొహమాటం బీడియం ఎక్కువగా ఉండడం వల్ల నటించడం కొంచం ఇబ్బంది పడేవారిని అన్నారు . అంతేకాకుండా ఎవరితో కలిసే వారు కాదని మా ఇంటి తలుపు పక్కన నిలుచొని పొగ తాగేవారని చెప్పుకొచ్చింది . రజినీకాంత్ అప్పట్లో కెమరా వైపు చూడడం కష్టమైనా పని అని బాలచందర్ గారే దగ్గరుండి నటన నేర్పించారని ఆమె గుర్తు చేసుకున్నారు .. 

Tags:    

Similar News