శ్రీరెడ్డిలా నేను చేయలేను ... షకీలా

ఆమె తెలుగులో కొబ్బరిమట్ట సినిమాల్లో నటించింది . ఇందులో హీరో సంపూకి తల్లిగా నటించింది ఆమె .. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా షకీలా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది .

Update: 2019-08-17 09:54 GMT

శృంగార తార షకీలా అంటే తెలియని వాళ్ళు ఉండరేమో .. అంతగా ప్రేక్షకుల్లో ఆమె ఆదరణ పొందారు ఆమె.. నటిగా ఆమెకి బాగానే సినిమాలు వచ్చిన శృంగార తార అనే ముద్ర పడడంతో ఆమె ఆమెకి సినిమా అవకశాలు తగ్గుముఖం పడుకుంటూ వచ్చాయి ..శృంగార తార అనే ముద్రని పోగొట్టుకోడానికి ఆమె ఎంతలా ప్రయత్నం చేసిన దానినుండి బయటపడలేకపోయింది . మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆమె తెలుగులో కొబ్బరిమట్ట సినిమాల్లో నటించింది . ఇందులో హీరో సంపూకి తల్లిగా నటించింది ఆమె ..

అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా షకీలా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది . ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమెని ప్రశ్నించగా తనపై శృంగార తార అనే బ్రాండ్ పడిపోవడంతో నాకు సినిమా ఇండస్ట్రీ నుండి పెద్దగా వేధింపులు ఎదురు కాలేదని చెప్పుకొచ్చింది . కెమరా ముందు అర్ధనగ్నంగా నటించేందుకు పెద్దగా ఇబ్బంది పడలేదని,శ్రీరెడ్డి లాగా బట్టలు విప్పుకొని రోడ్డుపైకి నిలబడలేనని,నా చేతుల కష్టంతో పైకి వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది . 

Tags:    

Similar News