సంచలన విషయాలను బయటపెట్టిన సాయి పల్లవి

సాయి పల్లవి... ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకుంది ఈ తమిళ భామ..

Update: 2020-03-30 09:17 GMT
Sai Pallavi

సాయి పల్లవి... ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకుంది ఈ తమిళ భామ.. నేచురల్ యాక్టింగ్, హీరోలతో సమానంగా డాన్స్, సొంతంగా డబ్బింగ్ ఇలా వేటికవే ప్రత్యేకతగా నిలుస్తుంది సాయి పల్లవి.. ఫిదా, ఎంసీఏ, పడి పడి లేచే మనసు మొదలగు సినిమాలు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ తమిళ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సాయి పల్లవి తన వ్యక్తిగత విషయాలను బయట పెట్టింది..

తాను యాక్టర్ కాకపోయి ఉంటే డాక్టర్ నీ అయ్యేదానీ నని వెల్లడించింది.. కార్డియాలజీ చదివి కార్డియాలజిస్ట్ అయి పేదవాళ్లకు చికిత్స చేసి దానిని అని తెలిపింది. తనకు చిన్నప్పటి నుంచి మాధురి దీక్షిత్, ఐశ్వర్యరాయ్ లకి పెద్ద అభిమానిని అని వారిని చూసి డాన్స్ నేర్చుకున్ననని వెల్లడించింది. తనకి కోయంబత్తూర్ అంటే చాలా ఇష్టమని, షూటింగ్ లేకపోతే అక్కడికెళ్ళి గడుపుతానని , అక్కడి వాతావరణం తనకెంతో ఇష్టమని సాయి పల్లవి పేర్కొంది..

ఈ కాలేజీ రోజుల్లో హీరో సూర్య అంటే తనకెంతో ఇష్టమని, అదృష్టం కొద్దీ ఎన్జీకే లో ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చిందని, ఆ షూటింగ్ అనుభవాలను ఎప్పటికీ మర్చిపోలేని సాయి పల్లవి వెల్లడించింది. ఇక ఫిదా సినిమా కోసం ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నానని, ఫిదా సినిమాలో వరుణ్ లాంటి అబ్బాయి దొరికితే వెంటనే ఐ లవ్ యు చెప్పేస్తాను అని వెల్లడించింది సాయి పల్లవి.. ఇక తనది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ అని వెల్లడించింది. తన మాతృభాష అయిన బడుగు కి లిపి కూడా లేదని పేర్కొంది.

ప్రస్తుతం సాయి పల్లవి అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తుంది.


Tags:    

Similar News