ఆ పాత్ర కోసం ముందుగా రాశిని అనుకున్నడట సుకుమార్ .... కానీ ?

Update: 2019-11-09 12:26 GMT
sukumar and raasi

హీరోయిన్ రాశి అంటే తెలియని వారు ఉండరు.. తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకున్న నటి ... రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, మోహన్ బాబు లాంటి అగ్ర హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది .. పెళ్లి అయిన తర్వాత సినిమాలని పక్కన పెట్టిన రాశి... మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే నాగ శౌర్య హీరోగా వచ్చిన కళ్యాణ వైభోగమే అనే సినిమాలో నటించింది.

ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ హీరోగా రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ ముందుగా హీరోయిన్ రాశిని సంప్రదించాడట.. సినిమాలో ఆ పాత్రకు సంబంధించిన నరేషన్ కూడా ఇచ్చాడట సుకుమార్... కానీ ఆ పాత్ర చేయడానికి రాశి నిరాకరించిందట.. సినిమా పాత్రలో భాగంగా మోకాలికి పైకి చీర ధరించడం, కాస్ల గ్లామ‌ర్‌గా ఉండ‌డం రాశికి ఇబ్బందిగా అనిపించిందట‌. దీనితో ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట రాశి..

ఆ పాత్రను ప్రముఖ యాంకర్ అనసూయ పోషించింది . ఆ పాత్రకు గాను అనసూయకి మంచి పేరు వచ్చింది. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాశి ఈ విషయాన్నీ చెప్పుకొచ్చింది.  

Tags:    

Similar News