నా పేరు మార్చింది ఆయనే : జీవిత

Update: 2019-10-10 12:38 GMT

తలంబ్రాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయం అయి విభిన్నమైన పాత్రలతో మెప్పించింది నటి జీవిత.. కేవలం నటిగానే కాదు దర్శకురాలుగా కూడా ఆకట్టుకుంది... అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవిత కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది." నా అసలు పేరు పద్మ నేను ప్లస్ టు చదువుతున్న సమయంలో తమిళ దర్శకుడు టి. రాజేందర్ నన్ను చూసి సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగారు. అప్పుడు 'ఉరవై కార్తకిలి' అనే తమిళ చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా నటించాను. ఆ సినిమాలో జయచిత్రగారి బ్రదర్ హీరోగా నటించారు. ఆ సినిమా షూటింగ్ టైం లో నా పేరును అయన జీవితగా మార్చారు. ఆ పేరు కూడా నాకు ఎంతో బాగా నచ్చింది ఇక అప్పటినుండి నా పేరు జీవితగా పలు సినిమాల్లో కొనసాగుతూ వచ్చిందని జీవిత చెప్పుకొచ్చింది." 

Tags:    

Similar News